సత్యసాయి: హేమావతి పంచాయతీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మాజీ టెంపుల్ చైర్మన్ నాగరాజు, రవీంద్రలతో సహా 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నందున తాము టీడీపీకు మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు. వారికి తిప్పేస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.