SRD: నిజాంపేట్ మండలం మునిగేపల్లి నుంచి-నాగ్ ధర్ వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతల మయంగా మారిందని వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని నాగ్ ధర్ గ్రామ ప్రజలు బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వర్షాకాలం కారణంగా గుంతలలో నీరు నిండడంతో రోడ్డుపై రాకపోకలకు వాహనాలకు, ధాన్యం సరఫరాకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందని నాగ్ ధర్ ప్రజలు తహసీల్దార్‌కు విన్నవించారు.