SDPT: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిద్దిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.