JGL: జగిత్యాల పట్టణ 25వ వార్డు తులసీనగర్లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, జెండా ఆవిష్కరణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసమూ పెరుగుతుందని పేర్కొన్నారు.