VZM: గుర్ల కేజీబీవీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పరుపులు కాలిపోవడంతో ఆ పొగ పీల్చి ఐదు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్ల కేజీబీవీను ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర డైరెక్టర్ చీకటి సుహాసిని నేడు సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.