KRNL: ప్రభుత్వ ఉద్యోగులు అత్యాశతో అవినీతికి పాల్పడకూడదని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2025 కార్యక్రమంలో తెలిపారు. ప్రజల పన్నుల డబ్బుతో వచ్చే జీతం ప్రజా సేవకే వినియోగించాలని ఆమె సూచించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరాలేనని, దోషిగా తేలితే జైలు శిక్ష ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సోమన్న హెచ్చరించారు.