విశాఖ జిల్లా కార్యాలయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, పార్టీ కమిటీల నిర్మాణంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు, విజయనగరం అధ్యక్షుడు చిన్న శ్రీను, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.