CTR: నవంబర్ 5వ తేదీ లోపు మొంథా తుఫాను నష్టపరిహారం నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తుఫాను నష్ట గణన ప్రక్రియ అంశంపై జిల్లాలోని అధికారులతో టెలి కన్ఫరెన్స్ నిర్వహించారు. తప్పులు లేకుండా నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ మేరకు ఏ మండలాలలో ఎంత నష్టం జరిగిందో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.