TG: ఓవర్సీస్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించుకుంది. 2022 నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలు ఒకే సారి క్లియర్ చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. దీంతో SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది.