KDP: కమలాపురం మండలంలోని అన్ని రైతుసేవా కేంద్రాల్లో ఇప్పటివరకు 2200 క్వింటాళ్ల శెనగల రిజిస్ట్రేషన్ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి సరస్వతి తెలిపారు. ఈ మేరకు ఇంకా మిగిలిన రైతులు రేపటిలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా కోగటం రైతు సేవా కేంద్రంలో శనగల నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో RSK సిబ్బంది పాల్గొన్నారు.