NZB: ఎస్సీ వర్గీకరణ దేశ చరిత్ర లోనే భారీ కుట్ర అని మాల మహానాడు జాతీయ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఈ కుట్రను భగ్నం చేసేందుకు దేశంలోని దళితులంతా ఐక్యమత్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన బుధవారం పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర చేసిందన్నారు.