SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రధాన కాలువ భూమిని ఆక్రమించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై రమేష్ తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మల్యాల గ్రామానికి చెందిన మోత్కుపల్లి తిరుపతి, మోత్కుపల్లి గంగాధర్, దుర్గ కొమురయ్య, బుర్కా ఎల్లయ్య, పోతరాజు రాజేందర్‌లపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.