MNCL: కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలో మదన పోచమ్మ జాతర తేదీలను ఖరారు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 5న చెన్నూర్ గోదావరి నదిలో అమ్మవార్లకు స్నానం, 8న రథాల శోభాయాత్ర, 9న బోనాల పండుగ అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.