VZM: మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు బుధవారం ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.