GNTR: జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.