AKP: రేపు భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నందున ఈ నెల 30న గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.