KRNL: నగరంలోని స్టేడియం రోడ్డులో ప్రజల సౌకర్యార్థం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం దీనికి సంబంధించి స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో లక్కి డ్రా నిర్వహించారు. 60 షాపుల నిర్వహణకు ప్రణాళికలో రూపొందించారు. అందులో 39 షాపులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.