ప్రకాశం: తర్లుపాడు మండలం రాగసముద్రం చెరువు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఎస్సీ పాలెంలోని 10 గృహాలను వరద నీరు చుట్టుముట్టింది. మండల అధికారులు జెసిబి సహాయంతో రోడ్డుకు గండి కొట్టించి, నీటి ప్రవాహాన్ని దారి మళ్లించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అలాగే ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కాంక్రీట్ పైపులు వేశారు. అధికారులను స్థానికులు అభినందించారు.