NLG: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున్న ఆర్ అండ్ బీ శాఖ అధికారులు హై అలెర్ట్‌లో ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ సెలవుపై వెళ్లరాదని సూచించారు. కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.