ASR: మొంథా తుఫాను నేపథ్యంలో ఈనెల 30వ తేదీ గురువారం అల్లూరి జిల్లాలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు యధావిధిగా నడవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె కేజీ, కందిపప్పు కేజీ, ఉల్లిపాయలు కేజీ అందిస్తున్నామన్నారు.