సత్యసాయి: రాజ్యాంగంపై మడకశిర నియోజకవర్గ స్థాయి క్విజ్ పోటీల్లో హరే సముద్రం జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సీఆర్ శిరీష విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి శాసనసభలో అడుగుపెట్టి మాట్లాడే అరుదైన అవకాశం శిరీషకు దక్కింది. స్టూడెంట్ ఎమ్మెల్యేగా శిరీష ఒకరోజు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.