GNTR: తెనాలిలో మున్సిపాలిటీ వ్యర్థాల తరలింపు తీరు ప్రజలను ఇబ్బంది పెడుతోంది. చెత్త తరలించే ట్రాక్టర్లపై పట్టాలు కప్పకపోవడంతో సగం వ్యర్థాలు రోడ్లపైనే పడిపోతున్నాయి. దీనివల్ల రాకపోకలు సాగించేవారికి తీవ్ర అసౌకర్యం, దుర్వాసన ఎదురవుతోంది. ఈ సమస్యను గుర్తించి వ్యర్థాలను తరలించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.