NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, సుమారు 2,06,406 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,61,937 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,62,282 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 587.50 అడుగులు వద్ద ఉండగా, పూర్తి స్థాయి 590 అడుగులు.