SKLM: పలాసలో గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా టెన్ని కాయిట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా టెన్ని కాయిట్ అధ్యక్షులు సంతోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికలో పాల్గొనే వారి వయస్సు 18 సంవత్సరాలు లోపు ఉండాలని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారిని నంబర్ 7 నుండి చీరాలలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు.