తెలంగాణ యువకుడు హాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. భద్రాచలానికి చెందిన వివేకానంద కొండపల్లి(34) ‘ద లాస్ట్ విజిల్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. కాగా.. భద్రాచలం శిల్పినగర్ కాలనీకి చెందిన కొండపల్లి మహేశ్-జమునారాణిల పెద్ద కుమారుడు వివేకానంద.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.