MDK: జిల్లాలో మహిళపై దాడి చేసి బంగారు వెండి ఆభరణాలు దోచుకుని అత్యాచారానికి ప్రయత్నించిన నేరస్థుడు పకీరా నాయక్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పు ఇచ్చినట్లు జిల్లా అదనపు ఎస్పి మహేందర్ తెలిపారు. నేరస్తుడికి గతంలో మరో కేసులో జీవిత ఖైదు విధించినట్లు వివరించారు. జైలు శిక్ష పడేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.