ప్రకాశం: తర్లుపాడులోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం తహసీల్దార్ కిషోర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్య, వారి విద్యా స్థాయి, రోజువారీ కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు.