SRD: జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలలలో నేటి నుంచి నవంబర్ 13 వరకు పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు స్వీకరించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులందరూ నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజ్ చెల్లించే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని అన్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు మాత్రమే ఫైనల్ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.