AP: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలపై దృష్టి పెట్టామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో 6 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని వెల్లడించారు. రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని భరోసా కల్పించారు. కౌలు రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.