TG: వరంగల్ పోతనరోడ్డులో వరద బీభత్సం సృష్టించింది. వరంగల్-హన్మకొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో రెండు కార్లు వరదలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వర్ష ప్రభావానికి సమ్మయ్యనగర్, సంతోషిమాత, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, గాంధీనగర్, కాపువాడ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.