ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని AITUC రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 31న AITUC 106వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి పాత చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.