KKD: ఈ నెల 27న మోటార్ బైక్ నుంచి కాలువలో పడి అదృశ్యమైన కాకినాడ రూరల్ సూర్యాపేటకు చెందిన బాలుడు పోలవరపు సాయి (13) మృతదేహం బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ గ్లాస్ బీచ్ వద్ద లభ్యమైంది. రెండు రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.