W.G: తుపాను, భారీ వర్షాల కారణంగా ప.గో. జిల్లాలో 93 ఇళ్లు, 174 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బలమైన ఈదురు గాలులు కారణంగా 662 చెట్లు నేల కొరిగాయని, రోడ్లపై విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.