E.G: ధవళేశ్వరం ఆనకట్టపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి దారవారానికి చెందిన షేక్ కాజా (42)గా గుర్తించినట్లు కొవ్వూరు రూరల్ SI కే. శ్రీహరి రావు తెలిపారు. ధవళేశ్వరంలోని HP గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్గా పనిచేస్తున్నారన్నారు. విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా వ్యాగన్-ఆర్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు.