NDL: నంద్యాల NGOs కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురు యువతులను, ఇద్దరు విటులను పట్టుకున్నామని 2 టౌన్ సీఐ అస్రర్ బాషా తెలిపారు. పవన్ అనే వ్యక్తి కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడన్నారు. యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విటులను అరెస్టు చేశామని పేర్కొన్నారు.