విశాఖ: మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 22 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆనందపురం మండలంలో 8, పద్మనాభం మండలంలో 6, భీమిలి మండలంలో 3, గోపాలపట్నం మండలంలో 2, పెదగంట్యాడ, మహారాణిపేట, విశాఖ రూరల్లో ఒక్కొక్క ఇల్లు దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపారు. వీటిలో పూర్తిగా దెబ్బతిన్నవి 2 ఉన్నట్లు పేర్కొన్నారు.