NLG: దేవరకొండ మండలం కొమ్మేపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థులను సురక్షితంగా తరలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లను మంత్రి అభినందించారు. మొంథా తుపాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.