విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం వర్షాల నేపథ్యంలో విశ్వవిద్యాలయంలోని పలు భవనాలు, హాస్టల్స్, రక్షణ గోడలను తనిఖీ చేశారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనాలు, ప్రహరీ గోడల పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.