అన్నమయ్య: ఉపాధ్యాయ వృత్తికి నాదిర్ష వలి వన్నె తీసుకువచ్చారని పలువురు ఉపాధ్యాయులు కితాబునిచ్చారు. ఇవాళ నిమ్మనపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ అపర్ణాదేవి మాట్లాడుతూ.. నాదిర్ష వలి ది నేషనల్ ఉర్దూ టీచర్ అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.