CTR: గుడిపల్లి మండల పరిధిలోని కంచ బంధార్లపల్లికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.