NZB: నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో రైల్వే గేటు డబ్లింగ్ లైన్ మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ గేటు మీదగా ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.