KNR: తుఫాన్ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మూడు రోజులపాటు యార్డ్‌కు సెలవులు ప్రకటించింది. ఖరీదుదారులు, అడిదారుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. నవంబర్ 3న సోమవారం నుంచి యార్డులో మళ్లీ క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.