అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని వాగులు వంకలపై నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బివైఎస్ ఆధ్వర్యంలో ఇవాళ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం అధ్యక్షుడు పునీత్ కుమార్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ కట్టడాలు వెలస్తున్నాయని ఆరోపించారు. కట్టడాలు తొలగించడం ద్వారా నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలుగుతాయన్నారు.