SKLM: తుఫాన్ బాధిత కుటుంబాలకు నగదుతో పాటు నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. బుధవారం హిరమండలం మండలంలోని ఎం. అవలంగి, కల్లాట గ్రామాలలో పునరావాస కేంద్రాలలో ఉన్న బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాల బాధితులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఒక్కో కుటుంబానికి మూడు వేల నగదు తో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.