AP: సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైంది. నవంబర్ 6న అమరావతి నుంచి లండన్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా లండన్ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించనున్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సైతం వివరించనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్కులు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్నారు.