GNTR: కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం సాయంత్రం పర్యటించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులతో మాట్లాడారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తుఫాను ముప్పు తప్పినందున ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.