VZM: మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలు , తుఫాను కారణంగా నెల్లిమర్లలో దెబ్బతిన్న వరి పంటలను బుధవారం ఏపీ మార్కఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, స్దానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ MPP కంది చంద్ర శేఖర్, పాణిరాజు తదితరులు పాల్గొన్నారు.