మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’లో మాళవిక మోహన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై మాళవిక స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన కెరీర్లో ఒక్కసారైనా చిరంజీవి లాంటి స్టార్ హీరోతో నటించాలని కోరుకుంటున్నానని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. కానీ ‘మెగా 158’లో తాను భాగం కాలేదని క్లారిటీ ఇచ్చారు.