NGKL: మొంథా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పత్తి తీయకపోవడంతో పొలంలోనే తడిసి ముద్దయింది. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టినా పొలాలు జాలువారి నీటిలోనే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది.