PPM: మొoథా తుఫాన్ ప్రభావంతో మన్యం జిల్లాలో 10 మండలాల్లో గల 1,591ఎకరాలలో వరి,మూడు మండలాల్లోని 161 ఎకరాలలో ప్రత్తి పంట వెరసి 1,752 ఎకరాల్లో పంట నీట మునిగినట్టు జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్ది తెలిపారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని, వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు వారీగా పంట నష్టం అంచనాలను తయారు చేస్తారని తెలిపారు.